అక్రమ నిర్మాణంలో ఉంటూ బాబు శ్రీరంగ నీతులు

విజయవాడః చంద్రబాబు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో అక్రమాలు అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. అక్రమ నిర్మాణంలో నివాసమున్న ముఖ్యమంత్రికి హైకోర్టు నోటీసులిచ్చిన విషయాన్ని జోగి గుర్తు చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలన్నీ కూలగొడతామన్న దేవినేని మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో ఉంటూ...నదులను రక్షించండి అని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

Back to Top