పోలీసులు అడ్డంపెట్టుకొని జన్మభూమి సభ


కృష్ణా: చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకొని జన్మభూమి సభను నడిపిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జన్మభూమి అధికారిక కార్యక్రమం కాదని, అది టీడీపీ కార్యక్రమమన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులందరికీ పెన్షన్‌లు, అడిగిన వారందరికీ ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా విపక్ష నేతలను కూడా రచ్చబండ కార్యక్రమంలోకి పిలిపించి సమస్యలపై మాట్లాడించి వాటిని పరిష్కరించే వారని చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారస్సు చేసిన వారికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో తొమ్మిది రకరాల రేషన్‌ సరుకులు ఇస్తే చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప ఏమీ రావడం లేదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని సభలను నడిపిస్తూ నిలదీస్తున్న ప్రజానికాన్ని బెదిరించే అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలను వంచిస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 
Back to Top