హోదాతో ‘ఉద్యోగ విప్లవం’ తెద్దాం

* ప్రత్యేక హోదా వస్తే వాంటెడ్‌ బోర్డులు చూస్తాం
* హైదరాబాద్‌లో ఉన్న సంస్థలన్నీ ఏపీలో పెట్టాలి
* వెంకయ్య ఈ విషయం ఎందుకు నోరు మెదపరు
* చంద్రబాబు, వెంకయ్య దొందూ దొందే
* బాబు మీద టాడా కేసు పెట్టినా తక్కువే
విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే ధ్యేయంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేగంగా దూసుకెళ్తున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ‘యువభేరి’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో తెలియజెప్పేందుకు విద్యార్థులు, నిరుద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘యువభేరి’ ప్రభావం యువతలో స్పష్టంగా కనిపిస్తుంది. విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను యువతీయువకులు గట్టిగానే నిలదీస్తున్నారు. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఈ యువభేరిలు నిర్వహించగా సోమవారం విజయనగరం జిల్లాలోని జగన్నాథ్‌ ఫంక్షన్‌హాల్లో ఎనిమిదో ‘యువభేరి’ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వీసీలు, రిజిస్ట్రార్‌లు, ప్రొఫెసర్లు రాష్ట్రానికి హోదా ఎంత ముఖ్యమో చట్టబద్ధత, ప్యాకేజీకి ప్రత్యేక హోదాకు మధ్యన వ్యత్యాసం తదితర విషయాలను వివరణాత్మకంగా విద్యార్థులకు తెలియజెప్పారు. దీంతోపాటు చంద్రబాబు చాలా బాగుందని ప్రచారం చేసుకుంటన్న ప్యాకేజీ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కనీసం చట్టబద్దత కూడా లేని ప్యాకేజీ ఒక ప్యాకేజీనా అని పెదవి విరిచారు. మాయమాటలతో ఐదున్నర కోట్ల మంది ప్రజలను వంచిస్తున్న సర్కారుకు బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చిందని మేధావులు పిలుపునిచ్చారు. వైయస్‌ జగన్‌ కంటే æ ముందు మాట్లాడిన వీరంతా విద్యార్థుల భవిష్యత్, ఏపీ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ప్రత్యేక హోదా అవసరం, రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న అవినీతి అరాచకాలు, మోసాలపై విద్యార్థులతో మాట్లాడారు. చివరిగా విద్యార్థులు ఒక్కొక్కరిగా అడిగిన ప్రశ్నలను ఆలకించి సమాధానమిచ్చారు. కష్టమనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ప్రత్యేక హోదా సాధించలేమా అని ప్రశ్నించారు. హోదాతో ఉద్యోగ విప్లవం తెస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక  పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... 

‘‘ యువభేరికి వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ప్రత్యేక హోదా ఉద్యమం విజయవంతం కావాలంటే దీన్నొక ఒక విప్లవంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశంలో పేదరికం పోవాలంటే చదువుతోనే సాధ్యం. పేదవాడు చదువుకునేందుకు అప్పులు చేసే దుర్ఘతి పోవాలి. దివంగత మహానేత ఆరోజుల్లో ఇదే అనేవారు. అందుకు ఆయన నిరంతరం శ్రమించారు. రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్‌ లాంటి కార్యక్రమాలతో ప్రతి కుటుంబంలో నవ్వులు విరబూసేలా చూశారు. 
మహానేత చదువుల విప్లవం తెచ్చారు..
బీసీలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఇస్త్రీ పెట్టెలు, బ్లేడు– కత్తెర్లు ఇస్తే సరిపోదు. వారు సొంతంగా తమ కాళ్లపై నిలబడే రోజు రావాలి. అది చదువుతోనే సాధ్యం. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్, ఇంజనీర్‌ రావాలి. ఎంత చదివినా ఆ కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకునే పరిస్థితి రాకూడదనే నిర్ణయంతో దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చదువుల విప్లవానికి  శ్రీకారం చుట్టారు. ఎంత చదివినా భరించడానికి నేనున్నానని ప్రతి కుటుంబానికి Ðð న్నెముకలా అండగా నిలిచారు. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌ నిధులు పప్పు బెల్లాలు పంచడానికే సరిపోవడం లేదు. పరిస్థితి దారుణంగా తయారైంది. అందుకే ఇప్పుడు ఉద్యోగ విప్లవం రావాలి. నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు బాగుండాలని అందరం కోరుకుంటాం. అలా జరిగితేనే అభివృద్ధి అంటాం. ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందా..? ఈ ప్రభుత్వాన్ని చూస్తే మనం బాగుపడతామన్న నమ్మకం మీకుందా..? దాదాపు మూడేళ్లయింది రాష్ట్రాన్ని విడగొట్టి. కానీ ఇప్పటికీ పరిస్థితుల్లో కొంచెం కూడా మార్పు రాలేదు.

మూడు రంగాలు కుదేలయ్యాయి
జీడీపీని ప్రధానంగా మూడు రంగాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం, ఉత్పాదక రంగం, సేవా రంగం. ఈ మూడు రంగాలు ప్రధానమైనవి. జీడీపీ హెచ్చుతగ్గులపై వీటి  ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏపీ జీడీపీ దేశాన్ని మించిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా దేశం కన్నా ఎక్కువగా మన రాష్ట్రం అభివృద్ధిలో అంతగా పరిగెడుతోందా. వ్యవసాయం, (పరిశ్రమల) ఉత్పాదక రంగం, సేవారంగంలో రాష్ట్రం దూసుకెళ్తుందా...? వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడేళ్లలో ఏటా కరువులు, అతివృష్టి. దేశ జనాభాలో 65 శాతం మంది వ్యవసాయం మీదే బతుకుతున్నారు. వీరికోసం చంద్రబాబు ఒక్క పథకమైనా తీసుకొచ్చారా. బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే బేషరతుగా రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. చేశారా.? నాడు 87 వేల కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పటికి లక్షా 709 కోట్లకు చేరుకున్నాయి. రైతులు తాము సంపాదించినదంతా అపరాధ రుసుం కట్టుకోవడానికే సరిపోతుంది. కరువు కారణంగా కేవలం 9 లక్షల హెక్టార్లలోనే పత్తి సాగు చేశారు. కేటాంపుల్లో బ్యాంకులిచ్చిన రుణాలు కేవలం 14 శాతం మాత్రమే.  
లెక్కలన్నీ అబద్ధాలే...
సోషియో ఎకనామిక్‌ సర్వే ప్రకారం చూస్తే లార్జ్‌ స్కేల్, ఎస్‌ఎంఎమ్‌ఈలకు వచ్చిన పెట్టుబడులు 2014–15లో 4138 కోటు,్ల 2015–16లో చూస్తే 4961 కోట్లు. కానీ ప్రభుత్వం చెప్పుకుంటున్నది మాత్రం వాస్తవ విరుద్ధంగా ఉంది. తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నారు. వ్యవసాయ రంగం, ఉత్పాదక రంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయంటే ‘బోడి సున్నా’. అయితే 21.02 శాతం జీడీపీ వచ్చిందని మోసం చేస్తున్నారు. అసలు నిజాలు తెలిసేనాటికి మూడేళ్లు టైం పడుతుందని ఇలా నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. నిజంగా జీడీపీ పెరిగితే పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. రైతుల అప్పులు తీరాలి. ఇదేమీ జరగలేదు. పైగా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయా అని వితండవాదన చేస్తారు. నిజంగా దారుణం. ఎన్నికలకు ముందు  ప్రత్యేకహోదాతోనే అభివృద్ధి అన్న బాబు, వెంకయ్యలు ఇప్పుడు మాత్రం హోదా కన్నా ప్యాకేజీనే బెటరని ప్రచారం చేస్తున్నారు. సన్మానాలు చేయించుకుంటున్నారు. వీళ్లనేమనాలి. 
ఇటువంటి సీఎం ఉండటం సిగ్గుచేటు
హోదా విషయంలో సీఎం, కేంద్ర మంత్రి వెంకయ్య ఓట్లు వేయించుకుని గెలిచాక మాట మార్చుతున్నారు. వీళ్లను చూసినప్పుడు ప్రత్యేక హోదాపై వీరికి పూర్తి అవగాహన ఉందా? అన్న అనుమానం కలుగుతోంది. వాళ్ల మీద ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు ఇలా మాట్లాడుతున్నారా అనిపిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేçస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. సీఎం ఏకంగా నల్లధనాన్ని సూటుకేసుల్లో పెట్టుకొని లంచం ఇస్తూ దొరికిపోయినా దేశచరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో? అలాంటి ముఖ్యమంత్రి కనీసం రాజీనామా చేసిన పాపాన కూడా పోలేదు. పైగా తన స్వార్థం కోసం, కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టి ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను తాకట్టుపెట్టారు. రాష్ట్రంలో  అమరావతి నిర్మాణం పేరిట రైతుల భూములు మింగేశాడు. ఆఖరికి  గుడి భూములు కూడా వదలలేదు. పట్టిసీమ నుంచి పోలవరం దాకా, మట్టి నుంచి ఇసుక దాకా, బొగ్గు కొనుగోలు వరకు ఇలా ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబుకు హోదాపై అవగాహన ఉందా? లేదా అన్న అనుమానం వస్తోంది. పైగా ఆయన పెద్ద ఎకనామిస్ట్‌నని చెప్పుకుంటారు. పేదరికంపై ఓ ఆర్థికవేత్త రాసిన పుస్తకం ప్రకారం ఇవాళ ఒక సమాజంగాని, రాష్ట్రంగానీ, దేశం గాని అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం పెట్టుబడికి డబ్బులు లేకపోవడం. దీనివల్ల ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉంటే పొదుపు చేయగలిగిన స్థోమత ఉండదు. పెట్టుబడులు తక్కువగా ఉంటే ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. తక్కువ ఉత్పత్తి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది. కొనుగోలు శక్తి ప్రభుత్వాలు పెంచకపోతే ఆదాయం తక్కువవుతుంది. ఆదాయం తక్కువగా ఉంటే వస్తువులు, సేవలను కొనుగోలు చేయలేరు కాబట్టి ఉపాధి, ఉద్యోగాలు ఉండవు. దేశం వెనకబడి పోతుంది. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుంది. 
రైతుల ఆదాయం పెంచిన మహానేత
ఈ థియరీని దివంగత నేత చక్కగా అమలు చేసి చూపించారు. రైతుల రియల్‌ ఇన్‌కం పెంచారు. రైతులకు జలయజ్ఞం ద్వారా ఆదాయ మార్గాలను చూపించారు. ధాన్యం మద్ధతు ధర పెంచారు. ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. ఏడాది తిరిగే సరికి రైతుల వద్ద మిగులు చూపించారు. ఫీజులు కట్టలేని దుస్థితిని చూసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. ఈ రెండు కార్యక్రమాలతో రైతులు లాభపడ్డారు. వీటితోపాటు 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఇదే దేశవ్యాప్తంగా 40 లక్షల ఇళ్లే కట్టించడం విశేషం. రైతులు వ్యవసాయం ద్వారా మిగుల్చుకున్న డబ్బును పొదుపు, పెట్టుబడులకు వినియోగించుకున్నారు. రైతుల కుటుంబాల్లో సంతోషం నింపారు.
నేరాలు, అవినీతిలోనే అభివృద్ధి 
బాబు మూడేళ్ల పాలన ఇందుకు విరుద్ధంగా ఉంది. నేరాలు, రౌడీయిజం, అవినీతి, బెదిరింపుల్లో మాత్రమే విచ్చలవిడి అభివృద్ధి జరిగింది. కేసులకు భయపడి ప్యాకేజీకి అంగీకరించి ప్రజల గొంతు కోశాడు. పోలవరం కాంట్రాక్టుల కోసమే హోదాను తాకట్టు పెట్టాడు. ప్యాకేజీతోనే అభివృద్ధి సాధ్యమని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడేస్తున్నాడు. అయితే చేసిన అభివృద్ధిని చూపించమని డిమాండ్‌ చేస్తున్నా. అమరావతిలో ఇప్పటికి ఒక్క ఇటుక కూడా లేవలేదు. ఇప్పటికీ జరిగినవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. ఇదేనా బాబు చెప్పే అభివృద్ధి. ప్రత్యేక హోదా వస్తే ఏపీ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తుంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్‌ బోర్డులు వస్తాయనేది నేను గట్టిగా నమ్ముతున్నా. ప్రత్యేక హోదా మీద గళమెత్తితే పీడీ యాక్టులు పెట్టిస్తారు. బంద్‌కు పిలుపిస్తే దగ్గరుండి బస్సులు నడిపిస్తారు. ఇలాంటి ముఖ్యమంత్రి మీద  టాడా యాక్టు ప్రయోగించినా తక్కువే. 
ఒక్క పైసా కూడా ఎక్కవ ఇవ్వలేదు
ప్రత్యేక హోదా వద్దనడానికి వీరు చెప్పే ప్రధాన ఆరోపణలు చూస్తే వారి అజ్ఞానానికి జాలేస్తుంది. వాస్తవానికి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల కన్నా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదు. ప్యాకేజీ పేరుతో చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
* ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 25 సంస్థలు, నిధులు ఇచ్చామని అరుణ్‌జైట్లీ చెప్పారు. 
* నా 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత గొప్పగా ఎవరూ నిధులివ్వలేదని కేంద్రమంత్రి వెంకయ్య చెప్పుకొచ్చారు. 
అయితే నిజాలు మాత్రం వేరుగా ఉన్నాయి. కోటి జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ 25 సంస్థలు పెట్టాలనేది నిబంధన. అదే కొనసాగిస్తుంది. కొత్తగా వచ్చిందేమీ లేదు. అలాంటప్పుడు మన రాష్ట్రానికి ఇచ్చిందేమీ గొప్పకాదు. దేశ జనాభాలో మనం పదో స్థానంలో ఉన్నాం. కాబట్టి అవన్నీ మనకూ అమలు చేసి తీరాలి. నా లేఖతోనే నోట్ల రద్దు చేశానని చెప్పుకుంటన్న ఈ అసమర్థ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కావాలని కూడా లెటర్‌ రాయొచ్చుగా.
* ఏ యాక్టులో ఉందని గుజరాత్‌కు రైల్వే యూనివర్సిటీ ఇచ్చారు. 
* హైదరాబాద్‌లో ఆనాడు ఏర్పాటు చేసిన మిథానీ, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, బీడీఎల్‌ లాంటి పెద్ద సంస్థలన్నీ ఏ యాక్టు ప్రకారం కట్టారు. 
* మహారాష్ట్ర– గుజరాత్‌ సరిహద్దులో ఏర్పాటు చేస్తున్న పెట్రో రిఫైనరీని ఏ యాక్టు ప్రకారం కడుతున్నారు. 
మనకేదో ఎవరికీ ఇవ్వనిది ఇచ్చినట్టు పదేపదే చెప్పి మన మనోభావాలను గాయపరచడం.. బిక్షగా వేస్తున్నట్టు చెప్పడం సిగ్గు చేటు. మనకివ్వాల్సింది యాక్టు ప్రకారం ఇవ్వరు.. వారికిష్టమైతే యాక్టులు అవసరం లేకున్నా ఇస్తారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని సంస్థలు మన ఏపీకి తీసుకొస్తామని వెంకయ్య చెప్పలేకపోయాడు. కానీ 44 ఏళ్లలో జరగని అభివృద్ధి చేశానని సన్మానాలు చేయించుకోవడం సిగ్గుచేటు. మన రాష్ట్రానికి విభజన చట్టంలోని ఏయే హామీలు అమలు చేశారో చెప్పాలని మన ఎంపీ అవినాశ్‌రెడ్డి పార్లమెంట్‌లో డిమాండ్‌ చేశారు. దీనికి కేంద్రం చెప్పిన సమాధానం వింటే నవ్వొస్తుంది. మనకు విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేశారని సిగ్గులô కుండా చెప్పుకొచ్చారు. 
2లక్షలా 3వేల కోట్ల లెక్క ఇదిగో
మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం మనకు లక్షా 3 వేల కోట్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ లెక్కలు చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు. పైగా దీనికి ప్యాకేజీ అని పేరుపెట్టి మోసం చేస్తున్నారు. చంద్రబాబు దీనికి బ్యాండు వాయిస్తున్నాడు. కేంద్రం నుంచి మనకు ట్యాక్సుల రూపేణా రావాల్సిన వాటా లక్షా 69 కోట్ల రూపాయలు. మనకన్నా ఉత్తరప్రదేశ్‌కు ఎక్కువ ఇస్తున్నారు. రెవెన్యూ లోటు పూడ్చడానికి 22,113 కోట్లు ఇవ్వాలి. మనతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుతోపాటు 11 రాష్ట్రాలకు కూడా ఇచ్చారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు 12 వేల కోట్లు ఇచ్చారు. ఈ మూడూ కలిపితే 2లక్షల మూడు వేల కోట్లు ఇచ్చారు. కొత్తగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రిసోర్స్‌ గ్యాప్‌కి సంబంధించి ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు తేడా చూపలేదని చెప్పుకొచ్చారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్‌ సేన్‌ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని మేము ఏనాడు చెప్పలేదని పార్లమెంట్‌లో మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాంచల్‌ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. హోదా లేని ఇతర రాష్ట్రాలకు ఎందుకివ్వడం లేదు. ఇలాంటి వాస్తవాలన్నీ పక్కనపెట్టి పార్లమెంట్‌ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారు. సమాజంలో అనేక అనర్థాలకు కారణం మూర్ఖులు అబద్ధాలనే నిజాలని బల్లగుద్ధి వాదిస్తుంటే మేధావులు చూస్తూ ఊరుకోవడమే. కష్టమనుకున్న తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనప్పుడు మనకి ప్రత్యేక హోదా అసాధ్యమేమీ కాదు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొని సంఘీబావం ప్రకటించిన ప్రొఫెసర్లందరికీ నా ధన్యవాదాలు.
Back to Top