భూములిచ్చి నష్టపోయాం


జననేతను కలిసిన జిందాల్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులు
విజయనగరంః జిందాల్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు మొరపెట్టుకున్నారు. భూమిలిచ్చి నష్టపోయామని  ఆవేదన వ్యక్తం చేశారు.  ఫ్యాక్టరీ గురించి పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉపాధిలేక అల్లాడిపోతున్నామని మొరపెట్టుకున్నారు. భూములిచ్చే ముందు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడ్డామని 11 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. జగనన్న వస్తాడు. మా ఫ్యాక్టరీ తెరిపిస్తాడని ఎదురుచూస్తున్నామన్నారు. జగన్‌ను సానుకూలంగా స్పందించి తప్పక న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ జ‌గ‌న్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో అనంతవాహినిలా సాగిపోతోంది. శనివారం ఉదయం జననేత 273వ రోజు పాదయాత్రను లక్కవరపు కోట మండలం కిర్లా నుంచి ప్రారంభించారు. 
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.



Back to Top