జైట్లీ తానా అంటే చంద్ర‌బాబు తందానా

హైదరాబాద్ :  రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అంశాల‌పై కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతుంటే చంద్ర‌బాబు దానికి వ‌త్తాసు ప‌లుకుతున్నాడ‌ని వైయ‌స్ఆర్‌కాంగ్రెస్‌పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. ఏపీకి రావాల్సిన నిధుల‌పై గ‌ట్టిగా అడ‌గాల్సిందిపోయి బాబు కూడా అన్ని మాకు ఇచ్చేశార‌ని అబ‌ద్ధాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రానికి మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్న వెంక‌య్య కూడా ప్ర‌జ‌ల‌ను వంచించ‌డానికి అబ‌ద్ధాలు చెబుతున్నార‌న్నారు. ముఖ్య‌మంత్రిగా కేంద్ర‌మంత్రుల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డానికే స‌మ‌యాన్నిక వెచ్చించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Back to Top