జేసీ ప్రధాన అనుచరుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

  ప‌శ్చిమ గోదావ‌రి: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం గోపాలనగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి అతని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు.  
 
Back to Top