జేసీ దివాకర్‌రెడ్డి మెంటల్‌ పేషంట్‌

అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డికి మతిభ్రమించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శంకర్‌నారాయణ అన్నారు. మహానాడులో జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలను శంకర్‌నారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా జేసీ దివాకర్‌రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతలు మెంటల్‌ పేషంట్స్‌ అయ్యారన్నారు. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. చంద్రబాబు భజన బృందానికి నాయకుడైన జేసీకి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. 
Back to Top