<strong>హైదరాబాద్, 25 మార్చి 2013:</strong> రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యపై సమాధానం చెప్పలేక కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పారిపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. విద్యుత్ సమస్యపై తమ పార్టీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక సభను వాయిదా వేసిందన్నారు. శాసనసభ మంగళవారానికి వాయిదా పడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ రోజు శాసనసభను వాయిదా వేసినంతమాత్రాన ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు. రేపు కూడా ఈ విషయమై ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామని శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు.