రాజ్యాంగేతర శక్తిగా జన్మభూమి కమిటీలు

చిల్లకల్లు (జగ్గయ్యపేట): టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి గ్రామాల్లో జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాయని వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చిలుకూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం మండల పార్టీ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడేళ్లుగా ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్న 750మంది లబ్ధిదారులకు నేటి వరకు కూడా బిల్లులు చెల్లించడంలేదన్నారు. ఉచిత ఇసుక అని చెప్పి అధికారపార్టీ నాయకులు తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. అనంతరం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపత్ విజిత, మాజీ సర్పంచి ముత్తినేని విజయశేఖర్‌ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్‌ హుస్సేన్‌ మండల రైతు, యువజన, కార్మిక విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్‌కన్వీనర్లు అన్నాబత్తుల శ్రీనివాసరావు, పోతుమర్తి స్వామి, కటికోల ఇజ్రాయెల్, అనుమాల వేదాద్రి, ఇరుగు రవీంద్ర, భూక్యా సైదానాయక్, మహిళ అధ్యక్షురాలు చల్లా సుశీల, గ్రామ నాయకులు సుంకర శ్రీనివాసరావు, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top