జన్మభూమి కమిటీ సభ్యులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

చిత్తూరు: రామకుప్పం మండలం, బల్ల పంచాయతీ టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న కె. రంగప్ప వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. బుధవారం కుప్పం నియోజక వర్గ కన్వీనర్‌ చంద్రమౌళి ఆధ్వర్యంలో బల్ల పంచాయతీ నుంచి రంగప్పతో పాటు పలు టీడీపీ నాయకులు పార్టీలో చేరారు. టీడీపీలో జరుగుతున్న ఆగడాలను తట్టుకోలేక  వైయ‌స్ఆర్‌ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఫ్పై ఏళ్ళుగా టీడీపీలో పని చేసి అధికారం వచ్చిన తరువాత క్రియాశీలక కార్యకర్తలను పట్టించుకున్న పాపాపపోలేదని విమర్శించారు. యువనేత జగన్‌ మోహన్‌రెడ్డి ఆశయాలను నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో బల్ల పంచాయతీ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖర్,  స్థానిక నాయకులు వెంకటేష్, కనకప్ప, పెరెప్పయ్య తదితరులు పాల్గొన్నారు. 

Back to Top