జన్మభూమి కమిటీలను రద్దు చేయండి

నరసరావుపేట: తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు డిమాండ్‌ చేశారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా మండలంలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కె.ప్రభాకరరావు అధ్యక్షతన ....మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో జన్మభూమి కమిటీలు కీలకంగా వ్వవహరిస్తున్నాయని, ఎంపీటీసీలకు కనీసం ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని జొన్నలగడ్డ ఎంపీటీసీ పొతిరెడ్డి శివారెడ్డి అన్నారు. 

లబ్దిదారులు కాకుండా జన్మభూమి కమిటీలే నిర్మాణాలు చేపడుతున్నాయని వివరించారు. అర్హులైన వారందరికి ఇవ్వకుండా కేవలం తమ వారికే మంజూరు చేస్తున్నారని తెలిపారు.  మండల పరిషత్‌ ఉపాద్యక్షుడు మాట్లాడుతూ లింగంగుంట్ల ఎస్టీ కాలనీలో బిల్లులు రాక మరుగుదోడ్లు మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. మరుగుదొడ్లు అంతా బోగస్‌ అని మండిపడ్డారు. పాతవాటిని కూడా కొత్తగా  కట్టినట్టు చూపిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎంఈవో జయకుమార్, హౌసింగ్‌ ఏఈ సుందరం, ఎసీడీపీవో కమలాక్షి, పంచాయాతీరాజ్‌ ఏఈ హారనాథ్, ఈవోపిఆర్‌డి శివసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 
Back to Top