జన్మభూమి కమిటీల పెత్తనం..అర్హులకు అన్యాయం

అనంతపురంః గుమ్మఘట్ట మండలంలో జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నాయి. ఈ జన్మభూమి కమిటీల ముసుగులో అవినీతి రాజ్యమేలుతోంది. చంద్రబాబు సృష్టించిన జన్మభూమి కమిటీల పుణ్యమా అని పేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షాగానే మిగిలిపోతున్నాయి. 9 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ కార్యకర్తలకు, అనుయాయులకు దోచిపెట్టేందుకు జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో కమిటీల పెత్తనం పెచ్చుమీరి పోయాయి. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా కాదని అధికారాలన్నింటిని జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో తెలుగు తమ్ముళ్లు అంతా తామై వ్యవహరిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో వారు చెప్పిందే వేదం.. వారు చేసిందే శాసనంగా మారింది. 

Back to Top