బాధిత కుటుంబాలకు జంగా పరామర్శ

గురజాల: ఇటీవల మృతి చెందిన పలువురి బాధిత కుటుంబాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి పరామర్శించారు. మండలంలోని గంగవరం గ్రామంలో వారం క్రితం గుండె పోటుతో షేక్‌ జమాల్‌షా(33), కేతినేని నారాయణ( 72) మృతిచెందారు. వారి కుటుంబాలను జంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట వైయస్‌ఆర్‌సీపీ గురజాల, దాచేపల్లి మండల కన్వీనర్లు సిద్దాడపు గాంధీ, షేక్‌ జాకీర్‌హుస్సేన్, టౌన్‌ కన్వీనర్‌ కుక్కమూడి అన్నారావు,  గ్రామ కన్వీనర్‌ కోమటి రమణ, మండల ప్రదాన కార్యదర్శి పూజల వెంకటేశ్వర్లు, జిల్లా యూత్‌ కార్యదర్శి మాచర్ల ఇవాంజికల్‌ బాబు, బీసీ ఐక్య కులాల వేధిక మండల కన్వీనర్‌ నక్కా శ్రీనివాసరావు, వెంకటశివయ్య, మాజీ సర్పంచ్‌ చలవాది నారాయణ, బ్రహేశ్వరావు తదితరులు ఉన్నారు.

Back to Top