సీఐ టీడీపీ ఏజెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

పిడుగురాళ్ళరూరల్ (మంగ‌ళ‌గిరి)

: ప్రతి అధికారి పచ్చచొక్కాలు తొడుక్కొని సామాన్య ప్రజలను సైతం భయబ్రాంతులకు గురి చేయటం సరైన పద్దతి కాదని, పోలీసు వ్యవస్థ అయితే మరింత దారుణంగా అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర బీసీ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని చిన అగ్రహారం గ్రామంలో ఇటీవలే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసినా వారిని ఆయ‌న ప‌రామ‌ర్శించి భ‌రోసా  క‌ల్పించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరచాలిగానీ, నాలుగు రోజులు చిత్ర హింసలకు గురి చేసి తర్వాత కోర్టులో హాజరు పరచటమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ఎస్‌ఐలు, సీఐ కలిసి వారిని దారుణంగా హింసించారని, అన్యాయంగా అరెస్టు చేసిన వారిని కొట్టే హక్కు ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. పిడుగురాళ్ళ సీఐ హనుమంతరావు ఓ పోలీస్‌ అధికారిగా కాకుండా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌ల్లీ స్థాయి నాయకుడైనా సరై టీడీపీకి మద్దతివ్వాలని పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకొని హింసించి వారిపై అక్రమ కేసులు బనాయించటం సరైన పద్దతి కాదన్నారు. సీఐ హనుమంతరావు రాజకీయాలు చేయాలనుచకుంటే పోలీస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పచ్చ తీర్దం పుచ్చుకోవాలని ఆయన సూచించారు.

Back to Top