బాబు మోసపూరిత వాగ్ధానాలకు బలికావొద్దు

నంద్యాలః బీసీలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షడు జంగా కృష్ణమూర్తి అన్నారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక జనాఊా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వైయస్ జగన్ పై అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. వైయస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తాయని తెలిపారు. నంద్యాలలో మీడియా సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైయస్ఆర్ ప్రవేశపెట్టిన అన్ని  సంక్షేమ కార్యక్రమాలు తమకు అందుతాయని ప్రజలు విశ్వాసంతో ఉన్నారని జంగా తెలిపారు. ఎప్పుడు గడప తొక్కని వారంతా ఆత్మీయ సదస్సుల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ మోసపూరిత వాగ్ధానాలకు బలికావొద్దని బీసీలకు మనవి చేశారు.  బీసీలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వైయస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ తో అవకాశం కల్పించారని చెప్పారు. ఈరోజు బాబు దాన్ని తుంగలో తొక్కారన్నారు. నంద్యాలకు వైయస్ జగన్ వస్తే ఆశీర్వదించేందుకు గ్రామాలకు గ్రామాలు తరలివెళ్తున్నాయన్నారు. జగన్ కు అండగా ఉంటామని చెబుతున్నారన్నారు. శిల్పా విజయం ఖాయమని జంగా దీమా వ్యక్తం చేశారు.

Back to Top