బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంక్‌గా మార్చారు

గార్లదిన్నె: చంద్రబాబు బీసీలకు కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశారని, అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మేలు ఒక్కటి కూడా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. గార్లెదిన్నెలో జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర బీసీల భరోసా యాత్రగా మారిందన్నారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి తెరలేపారన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకొని బీసీల సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. 
Back to Top