జననేత బాటలో విద్యార్థులు,యువత..!

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు నిరుద్యోగయువతను మోసం చేశాడని వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ నాయకుడు సలాంబాబు మండిపడ్డారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్ర దశ దిశ తిరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విద్యార్థులు,యువత భవిష్యత్ కోసం దీక్ష చేపట్టారని ఈసందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారన్నారు. 

వైఎస్ జగన్ ను చూడాలి, తమ సమస్యలు చెప్పుకోవాలని విద్యార్థులు, యువత అంతా ముందుకు వస్తున్నారని సలాంబాబు తెలిపారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు.  వైఎస్ జగన్ చేపట్టే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొంటామని క్షేత్రస్థాయిలో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. 
Back to Top