జననేత జగన్ వెంటే జనం

విజయనగరం జిల్లా:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి వెంటే జనం ఉన్నారని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని కొండగండ్రేడు పంచాయతీ మదుర గ్రామాలైన పల్లపేట, ముద్దాడపేట, గొల్లలపేట, గేదెలపేట గ్రామాల్లో పెనుమత్స పర్యటించారు. ఆయా గ్రామాల్లోని సుమారు వంద కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పెనుమత్స మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని, శ్రీ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

Back to Top