'జననేత జగన్‌కు జనం ఓట్లతో శక్తి'

చిత్తూరు : ప్రజలు వేసే ప్రతి ఓటు వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి శక్తినిస్తామని, ఆయన నిర్దోషిగా విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుందని పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశా‌యి తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా అరికెలలో మంగళవారం నిర్వహించిన సహకార ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం పాటు పడితే, వ్యవసాయం ‌అంటే ఏమిటో కూడా తెలియని ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని చెప్పారు. జిల్లాలో వై‌యస్‌ఆర్‌ సిపి జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్,‌ పార్టీ మైనారిటీ‌ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్తర్ అహమ్మ‌ద్, మండల పరిశీలకుడు చిప్పిలి జగన్నాథరెడ్డి సభలో మాట్లాడారు.‌

తాజా ఫోటోలు

Back to Top