'జనం సంతకం'లో విద్యార్థుల విశేష స్పందన

బొబ్బిలి (విజయనగరం జిల్లా) : 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో పాల్గొని మద్దతునివ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఇచ్చిన పిలుపుతో యువతరం‌ ఉత్సాహంగా స్పందించింది. బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్.వి. సుజయకృష్ణ రంగారావు, బేబీనాయన ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విద్యార్థులు అధిఖ సంఖ్యలో బారులు తీరారు. నూతన సంవత్సర వేడుకలను బహిష్కరించిన విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్‌ కోసం సంతకాల సేకరణలో పాల్గొన్నారు.

సంతకాలు చేసిన పలువురు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకు రాకుండా సిబిఐ కుట్రలు పన్నుతున్నదని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వానికి నిరసన తెలిపారు. బొబ్బిలిలోని పలు విద్యాసంస్థల విద్యార్థులు 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ, ఆయనను తక్షణమే విడుదల చేయూలని కోరుతూ విజయనగరంలో మంగళవారం చేపట్టిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి తమ మద్దతు పలికారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా వైయస్‌ఆర్‌సిపి విజయనగరం జిల్లా కన్వీనర్‌ పెన్మత్స సాంబశివరాజు స్వగ్రామం మొయిదలోని ఆయన నివాసం వద్ద చేపట్టిన సంతకాల సేకరణలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారంతా పార్టీ పిలుపు మేరకు వాటిని బహిష్కరించి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్మత్స మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలంతా శ్రీ జగన్‌ విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పరిపాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
Back to Top