<strong>ఒంగోలు: </strong>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్ కోసం.. జనం చేసే ప్రతి సంతకమూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కుమ్మక్కు రాజకీయాలు నడిపే నాయకులకు కన్నువిప్పు కావాలని వైయస్‌ఆర్‌సిపి విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక రామ్‌నగర్ ఏడవ లైన్‌లో ఎమ్మెల్యే కూడా అయితన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు.<br/>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ కె.వి. రమణారెడ్డి, జిల్లా యువజన విభాగం అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, విజయవాడ సిటీ ఇన్‌చార్జి వై. వెంకటేశ్వరరావు, నాయకులు వంకా రాఘవరాజు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.