జనం గుండెల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్

పాలకొండ:

జనం గుండెల్లోంచి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ తొలగించలేరని మరోసారి రుజువైం దని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం చెప్పారు. వీరఘట్టం, పాలకొండ, వంగర మండ లాల్లోని పీఏసీఎస్‌లలో విజయం సాధించిన పార్టీ మద్దతుదారులతో ఆనందం పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పాలకొండ డివిజన్‌లో జరిగిన సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు విజయభేరి మోగించి దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి, జననేత జగన్మోహన్‌ రెడ్డిలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల హదయాల్లోంచి వైయస్‌ఆర్‌ సీపీని తొలగించలేరని దీంతో రుజువైందన్నారు. పాలకొండ డివిజన్‌లోని 8 సహకార సంఘాల్లో ఐదింటిని వైయస్‌ఆర్  కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారని వివరించారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే కలిసి పన్నిన కుయుక్తులను, టీడీపీతో చేతులు కలిపి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే వారి యత్నాలను ఓటర్లు తిప్పికొట్టారన్నారు. తద్వారా ఆ పార్టీలకు బుద్ది చెప్పారన్నారు. పార్టీ మద్దతుదారులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top