'జనం గుండెల్లో జగన్‌కు ప్రత్యేక స్థానం'

మణుగూరు (ఖమ్మం జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రజలు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం కల్పించారని పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పువ్వాడ అజ‌య్‌కుమార్ తెలిపారు. శ్రీ జగన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలన్న కోరిక జనంలో బాగా నాటుకుపోయిందని అజయ్‌కుమార్,‌ పార్టీ సీఈసీ సభ్యుడు జలగం వెంకట్రావ్ అన్నారు. మణుగూరు పూల మార్కె‌ట్ సెంట‌ర్‌లో శనివారం కోటి సంతకాల సేకరణలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష తెలుగుదేశం కలిసి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించాయని విమర్శించారు. జనం మది నుంచి శ్రీ జగన్‌ను ఆ పార్టీలు దూరం చేయలేక సతమతం అయిపోతున్నాయని వ్యాఖ్యానించారు. కోటి సంతకాలకు వస్తున్న అపూర్వ ఆదరణే దీనికి నిదర్శనమన్నారు. వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పిలుపు మేరకు చేపట్టిన ఈ సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ‘ప్రజల స్పందనను చూస్తుంటే.. కోటి కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల మంది సంతకాలు చేస్తార’ని అన్నారు.

ముండుగా జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ‌, మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతో‌ మంది నిరుపేదల జీవితాల్లో వెలుగు ప్రసాదించాయని అన్నారు. ఆ పథకాలను సక్రమంగా అమలు చేయగల సత్తా ఆయన వారసుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారని చెప్పారు. మహానేత వైయస్ పథకాలను ఆయన మరణానంతరం కాంగ్రె‌స్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. వైయస్‌ఆర్‌సిపి మణుగూరు మండల కన్వీనర్ వట్టం రాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం‌ జరిగింది.

తాజా ఫోటోలు

Back to Top