జనకెరటాలు.. జగన్నినాదాలు

అనుముల:

రాష్ట్ర మంత్రి జానారెడ్డి స్వగ్రామం అనుముల. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ఆ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ప్రజలంతా తరలివచ్చారు. మహిళలు పెద్దసంఖ్యలో విచ్చేశారు. తాము పడుతున్న కష్టాలను ఆమె ఏకరువు పెట్టారు.  అన్నీ శ్రద్ధగా విన్న శ్రీమతి షర్మిల కొద్దినాళ్ళు ఓపికపడితే జగనన్న ముఖ్యమంత్రవుతారనీ, తదుపరి మీ ఇక్కట్లన్నీ తీరతాయనీ వారికి భరోసా కల్పించారు. వికలాంగురాలైన ఓ మహిళ తనకు రెండేళ్లుగా పెన్షన్ రావడం లేదని కన్నీళ్ల పర్యం తమైంది. అధికారులతో మాట్లాడి ఆ మహిళకు పెన్షన్ వచ్చేలా చూడాలని ఆమె స్థానిక నేతలను పురమాయిం చారు. అ నంతరం అక్కడికి కొద్ది దూరంలో ఉన్న హాలియా చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద జనసందోహం ఆమె కోసం ఎదురుచూస్తోంది. ఎటు చూసిన జనకెరటాల హోరు ప్రతిధ్వనించింది.  రాజన్న బిడ్డ మాటలు వినేందుకు.. చూసి ఆశీర్వదించేందుకు జనం స్వచ్ఛందంగా కదిలి వ చ్చారు.. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఏడోరోజు హాలియా మండలంలో విజయవంతంగా జరిగింది. బహిరంగ సభలో ఆమె ప్రభుత్వ  తీరును ఎండగడుతూనే, చంద్రబాబుపై షర్మిల విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖా మంత్రి జానారెడ్డి పనితీరుపైనా మండిపడ్డారు.

     ప్రజల కష్టాలకు వారిని వదిలేసి ముప్పై ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధీ చేయని మంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్, అన్నా, ఆయన బిడ్డలన్నా తమకు ఎంత అభిమానం ఉందో ఈ సభకు హాజరు కావడం ద్వారా ఆయకట్టు ప్రజలు చెప్పకనే చెప్పారన్నారు.  అన్ని మండలాల నుంచి మహిళలు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చి అభిమానం చాటుకున్నారు. మంత్రి జానారెడ్డి తీరును నిలదీసినప్పుడు సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ చ్చింది. చంద్రబాబు 2వేల కిలోమీటర్ల పాదయాత్ర రికార్డు అంటూ చేసిన హడావిడిపై షర్మిల తనదైన శైలిలో స్పందించారు. ఆయన వెన్నుపోటు రాజకీయం, వ్యవసాయ దండుగ అన్న ప్రకటన, విపక్ష నేతగా ఉంటూ ప్రభుత్వాన్ని నెత్తినపెట్టుకున్న వ్యక్తిగా పలు రికార్డులు సాధించారని వ్యంగ్యంగా ఉదహరించారు. హాలియా నాలుగు రోడ్ల కూడలి పూర్తిగా నిండిపోవడంతో చుట్టూ ఉన్న బిల్డింగులపై నిలుచుని షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆయా సందర్భాలకు తగినట్లు సామెతలు ఉపయోగించి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. గురువారం ఉదయం హాలియా మండలం రామడుగు శివారు నుంచి యాత్ర మొదలైంది. దారి పొడవునా బత్తాయి తోటల్లో పనిచేస్తున్న కూలీలు, పత్తి కూలీలు ఎదురొచ్చి షర్మిలను కలుసుకున్నారు. తమ కష్టాలు చెప్పుకున్నారు.

Back to Top