జ‌న హార‌తి

నంద్యాల‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చారానికి విశేష స్పంద‌న‌
అడుగ‌డుగునా పూల‌వ‌ర్షం
జ‌న‌నేత‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు పోటీప‌డ్డ స్థానికులు
ప్ర‌తిప‌క్ష నేత‌కు వాల్మీకుల విన‌తి
గోడు వెల్ల‌బోసుకున్న కేశ‌వ‌రెడ్డి బాధితులు
నంద్యాల ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాక‌తో నంద్యాల ప‌ట్ట‌ణం పుల‌కించింది. ఒక్క‌సారిగా జ‌నం జ‌న‌నేత‌ను చూసేందుకు, మాట్లాడేందుకు, క‌ర‌చాల‌నం చేసేందుకు ఎగ‌బ‌డ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 9 నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు నంద్యాల‌, గోస్పాడు మండ‌లాల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన వైయ‌స్ జ‌గ‌న్ ఇవాళ నంద్యాల ప‌ట్ట‌ణంలో ప్ర‌చారం ప్రారంభించారు. ప‌ట్ట‌ణంలోని 7, 11, 13వ వార్డుల‌లో జ‌న‌నేత ప‌ర్య‌టించారు. ఉద‌యం నుంచి ప‌ట్ట‌ణంలోని ఎస్పీజీ చ‌ర్చ్‌, శ్రీ‌నివాస‌సెంట‌ర్‌, ఫరుక్ నగర్, ఎస్ ఆర్ మూర్తి న‌గ‌ర్‌,  స్కావెంజ‌ర్స్ కాల‌నీ,  బాల్కొండ హాల్, సంచిక బట్టల వీధి, వెంకటేశ్వర కాలనీ, గుడిపాటి గడ్డ, మేడమ్ వారి వీధి, జుమ్మామసీదు ఏరియా,  గాంధీ చౌక్, .కల్పనా సెంటర్, ముల్లనా పేట,  మునిసిపల్ హైస్కూలు ఏరియా, చాంద్ బడా ప్రాంతాల్లో ఆయ‌న రోడ్డు షో నిర్వ‌హించారు. శ్రీ‌నివాస్ సెంట‌ర్‌, ఫ‌రూక్ న‌గ‌ర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప‌బ్లిక్ మీటింగ్స్‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. జ‌న‌నేత రోడ్డు షోకు స్థానికులు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌త్యేకంగా ముస్లింలు వైయ‌స్ జ‌గ‌న్‌కు ద‌ట్టి క‌ట్టి, త‌ల‌పై టోపీ పెట్టి స‌త్క‌రించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో తాము పొందిన ల‌బ్ధిని ముస్లింలు గుర్తు చేసుకున్నారు. త‌మ మ‌ద్ద‌తు వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డికే అని వైయ‌స్ జ‌గ‌న్‌కు స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌లు, యువ‌కులు, చిన్న‌పిల్ల‌లు మిద్దెల‌పై ఎక్కి జ‌న‌నేత‌ను చూసి మురిసిపోయారు. ఆయా వీధుల్లో వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌లు, వృద్ధుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌లించారు. ప‌లువురు యువ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌తో సెల్ఫీలు దిగి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప్ర‌తిప‌క్ష నేత దృష్టికి తీసుకెళ్లారు. కేశ‌వ‌రెడ్డి విద్యా సంస్థల‌ అధినేత కేశ‌వ‌రెడ్డి బాధితులు వైయ‌స్ జ‌గ‌న్‌కు క‌లిసి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. ఇక వాల్మీకులు పెద్ద సంఖ్య‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. త‌మను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాల‌ని వారు కోరారు.

నంద్యాలను మోడ‌ల్ టౌన్‌గా తీర్చిదిద్దుతా
ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నంద్యాల వాసుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు. ‘‘నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటా. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా నంద్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాన‌ని వెల్ల‌డించారు. నంద్యాలను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతా’’ అని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ పెట్టబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద పెద్ద నేతలు నంద్యాల రోడ్లపై తిరుగుతున్నారని వైయ‌స్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసి ఉంటే వీరంతా  నంద్యాలవైపు తొంగిచూసేవారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే  సీటును గెలిపించేందుకు జరుగుతున్నవి మాత్రమే కావని... మూడున్నరేళ్ల చంద్రబాబు దుర్మార్గ, అవినీతి, అసమర్థ, అన్యాయ, అధర్మపాలనకు వ్యతిరేకంగా జనం వేస్తున్న ఓటు అని పేర్కొన్నారు. ఈ ఓటు ద్వారా నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలిచారని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.  ‘‘మీరు వేసే ఓటుతో నేను సీఎం కాకపోవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసాలకు, అన్యాయానికి, అబద్ధాలకు, అధర్మానికి, అవినీతికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తున్నారని గుర్తు చేశారు.
 చంద్రబాబు మాదిరిగా తన దగ్గర డబ్బుల మూటలు, పోలీసు బలగం, ముఖ్యమంత్రి పదవి, బాకా చానళ్లు, పత్రికలు లేవని.... దివంగత ముఖ్యమంత్రి, నాన్న వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి మీద మీకున్న అభిమానం. నాన్న సంక్షేమపథకాలు ఇంకా మీ గుండెల్లో బతికే ఉండడమే తనకున్న ఆస్తి అని పేర్కొన్నారు. 

చెప్పింది చేస్తా..చేసేదే చెబుతా
తాను చెప్పింది చేస్తాన‌ని, చేసేది చెబుతానని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.  వైయ‌స్ జగన్‌ అబద్ధం ఆడడు. వైయ‌స్ జగన్‌ మోసం చేయడు... వైయ‌స్ జగన్‌ మాట ఇస్తే తప్పడు. వైయ‌స్ జగన్‌ ఏదైనా చెబితే చేస్తాడు అన్న విశ్వసనీయ రాజకీయాలే నాకు ఉన్న బలం’’ అని ఆయన వివరించారు. అహంకారంతో చంద్రబాబుకు కళ్లు నెత్తికి ఎక్కాయి. డబ్బుతో ఎమ్మెల్యేల మాదిరిగా ప్రజలనూ కొనవచ్చునని అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేసి... అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు శిల్పా మోహన్‌ రెడ్డి మీద చూపించి ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని వైయ‌స్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.  
Back to Top