తక్షణమే జలీల్ ఖాన్ ను అరెస్ట్ చేయాలి

విజయవాడః నిన్న విజయవాడలో పార్టీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, సాక్షి పాత్రికేయులపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఆయన అనుచరులు అమానుషంగా దాడికి పాల్పడటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాం బాబు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన జలీల్ ఖాన్, ఆయన అనుచరులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచి, అధికార పార్టీ  ప్రలోభాలకు లొంగి, కన్నతల్లి లాంటి పార్టీకి వెన్ను పోటు పొడవడమే గాకుండా, పార్టీ జారీ చేసిన విప్ ను అందించేందుకు వెళ్లిన పార్టీ నేతలు, విద్యార్థి విభాగం నాయకులపై దాడికి పాల్పడడం హేయమన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు ప్రోద్బలంతో, ఆయన అండ చూసుకొని గుండాయిజాన్ని చలాయిస్తున్న జలీల్ ఖాన్ కు ...విజయవాడ ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెబుతున్నారన్నారు. 
Back to Top