ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబుకు జైలు ఖాయం

ఢిల్లీ: ఓటుకు కోట్ల కేసులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిల్‌ను గౌరవ సుప్రీం కోర్టు స్వీకరించింది. ఓటుకు కోట్ల కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్రధాన కేసుకు తాజా పిల్‌ జత చేయాలని గౌరవ ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రరాష్ట్ర ప్రజల సొత్తును అప్పనంగా దోచుకుంటూ ఆ డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేను కొంటూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయి రెండున్నర సంవత్సరాలుగా కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆంధ్రరాష్ట్ర హక్కు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని విమర్శించారు. తెలంగాణ ఏసీబీ రెండో చార్జ్‌షీట్‌లో ఆడియో, వీడియో ట్యాప్‌లలో ఉన్నవన్నీ నిజాలని నిర్దారించిందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసును ఏసీబీ నుంచి సీబీఐకి అప్పగించాలని పిల్‌ వేశానన్నారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు గతంలో వేసిన కేసును రెండు కలిపి వింటామని చెప్పిందన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కోట్ల కేసులో దొరికిపోవడం, జైల్లోకి వెళ్లడం ఖాయమన్నారు. 

తాజా వీడియోలు

Back to Top