జై జగన్ నినాదాలతో మార్మోగిన సభా ప్రాంగణం

మంగళగిరి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలోని సమర దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకతో ఒక్కసారిగా సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగిపోయింది. నినాదాలు, చప్పట్లు, ఈలలతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమ మద్దతు తెలిపారు. పోలీసుల బందోబస్తు మధ్య వైఎస్ జగన్ దీక్షా స్థలికి చేరుకున్నారు. అభిమానులు కరచాలనం కోసం ఎగబడుతున్నారు.

రెండు రోజుల దీక్షకు ఇప్పటికే పలు జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అభిమానుల కేరింతలు, జై జగన్, జోహార్ వైఎస్ఆర్ నినాదాల మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షా ప్రాంగణంలోకి చేరుకున్నారు. వేదికపైకి చేరుకున్న వైఎస్ జగన్.. అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రజలకు, కార్యకర్తలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
Back to Top