జై జగన్ నినాదాలతో మార్మోగిన కస్తూరిదేవి గార్డెన్

నెల్లూరుః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నినాదాలతో నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్ మార్మోగిపోయింది. అక్కడకు విచ్చేసిన జననేతకు పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పార్టీనేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన తనయుడుతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

Back to Top