జై జగన్ నినాదాలతో మార్మోగిన మాచర్ల

గుంటూరు(మాచర్ల): మాచర్ల జనసందోహమైంది. జై జగన్ నినాదాలతో పల్నాడు ప్రాంతం మారుమోగింది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాచర్లకు వచ్చిన సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పులివెందుల పులిబిడ్డ, రాజన్న తనయుడు జై జగన్ అంటూ కార్యకర్తలు నినదించారు. కరవుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మాచర్ల ఎమ్మార్వో ఆఫీసు వద్ద  వైఎస్ జగన్ , స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధర్నా నిర్వహించారు. ఈధర్నాలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. కరవు, తాగునీటి సమస్యలపై తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

Back to Top