సమానత్వం కావాలని వెలుగెత్తి చాటిన మహనీయుడు జగ్జీవన్‌రామ్‌



– వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి  
హైదరాబాద్‌: మానవులందరిలో సమానత్వం కావాలని వెలుగెత్తి చాటిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రామ్‌ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్‌ చనిపోయి ఇప్పటికీ  32 సంవత్సరాలు అయిందన్నారు. ఆయన బీహార్‌లో 1908, ఏప్రిల్‌ 8వ తేదీ జన్మించారన్నారు.  ఆ నాటి దళిత నాయకులు అంబేద్కర్, జగ్జీవన్‌రావు ఇద్దరే. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించారన్నారు. ఈ రాజ్యాంగం ప్రపంచంలోని దేశాల్లో మన రాజ్యాంగమే ఉన్నతమైనదన్నారు. జగ్జీవన్‌రామ్‌ మొట్టమొదటిసారిగా ఆలిండియా డిప్రిసరీ క్లాస్‌ను ఏర్పాటు చేసి మానవులందరిలో సమానత్వం కావాలని వెలుగెత్తి చాటారన్నారు. 27 సంవత్సరాల వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. ఆ తరువాత పార్లమెంట్‌కు వెళ్లి 38 సంవత్సరాలలోనే జవహార్‌లాల్‌ నెహ్రూ కెబినెట్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. మొట్ట మొదటిగా కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. దేశంలో మొట్ట మొదటి మంత్రివర్గం 1946లో ఏర్పాటైందని, ఆ మంత్రివర్గంలోనే ఈయన మంత్రిగా ఉన్నారన్నారు. ఆ తరువాత దేశానికి డిఫెన్స్‌ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. జగ్జీవన్‌రామ్‌ రెండుసార్లు దేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారన్నారు. ఆయన నాయకత్వంలోనే గ్రీన్‌ రివల్యూషన్‌ వచ్చిందన్నారు. దేశానికే ఆహార భద్రతా కల్పించారని, ఆహార ధాన్యాల కొరత లేకుండా చేశారన్నారు. బీహార్‌లో సొంతంగా పార్టీ పెట్టారన్నారు. తక్కువ వయసులోనే ఆయన చనిపోయారన్నారు. ఆయన చరిత్రలో మాత్రం నిలిచిపోయారని, కేవలం దళిత వర్గానికే గాక, మానవత్వంలో మానవులంతా సమానంగా ఉండాలని ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆయన కుమార్తె మీరా కుమారిని మంత్రిగా చేయడమే కాకుండా, లోక్‌సభ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారన్నారు. సమాజానికి బాబు జగ్జీవన్‌రామ్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశమంతా ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు వైయస్‌ఆర్‌సీపీ తరఫున, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. 
 
Back to Top