కులవివక్షతపై జ‌గ్జీవ‌న్‌రామ్ రాజీలేని పోరాటం

ఆదోని టౌన్‌: కులవివక్షతపై రాజీలేని పోరాటం చేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఆదోనిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఘనంగా నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణ పార్టీ కార్యాలయం నుంచి మోటార్‌సైకిళ్లపై ర్యాలీగా తిమ్మారెడ్డి బస్టాండు వద్దకు వెళ్లారు. అక్కడున్న బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 
చాగలమర్రి: మండలం లోని వివిధ గ్రామాల్లో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి కార్య‌క్ర‌మాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక గాంధీసెంటర్‌లో వైయ‌స్ఆర్ సీపీ నాయకుడు కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కోలిమి హుస్సెన్ వ‌లి, శేషు రమేష్, జులేబి షరీఫ్, ఖాసీం వలి, ముల్లా రఫి, ముగ్బుల్, మాబుషరీఫ్, గౌస్‌పీరాన్, కానాల మాబ్బాష, ఆర్‌ఎస్‌ రమణ, నవత ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top