అణగారిన‌ వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్‌

రాజంపేట టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని దివంగత బాబు జగ్జీవన్‌రామ్‌ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకులు పోలా శ్రీనివాస్‌రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డిలు అన్నారు. స్థానిక ఆకేపాటి భవన్‌లో బుధవారం రాజంపేట మండల పార్టీ ఎస్సీసెల్‌ కన్వీనర్‌ దండు గోపి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలా శ్రీనివాస్‌రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డిలు పాల్గొని జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. నివాళుల‌ర్పించిన వారిలో వైయ‌స్ఆర్‌ సీపీ ఎస్‌ఆర్‌.యూసఫ్, జెనుగు కృష్ణారావుయాదవ్, పుత్తన శేఖర్‌రెడ్డి, పోలి మురళీరెడ్డి, గోవిందు బాలకృష్ణ, పసుపులేటి సుధాకర్, ఎస్‌ఎండీ.జాకీర్‌హుస్సేన్, టైగర్‌ హుస్సేన్, బలిజపల్లె చిన్న, పోతురాజు దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top