ఘనంగా బాబు జగ్జీవన్‌ రావ్‌ జయంతి వేడుకలు

కదిరి: అగ్రకుల ఆధిపత్యాన్ని అధిగమించి పార్లమెంట్‌లో ప్రవేశించి, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా బాబు జ‌గ్జీవ‌న్‌రావు బాధ్యతలు నిర్వర్తించారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ పీవీ సిద్దారెడ్డి గుర్తు చేశారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం  సిద్దారెడ్డి స్వగృహంలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రావు 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రావు చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఆయన గొప్పతనాన్ని, ఆశయాలను, సూచించిన మార్గాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు గంగాధర్, అప్పల్ల, శంకర్, రాంప్రసాద్, బాలాజీ, గిరిజన నాయకులు చలపతినాయక్, వెంకటేష్‌నాయక్, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకులు లోకేశ్వరరెడ్డి, కౌన్సిలర్లు రాజశేఖర్‌రెడ్డి, జిలాన్, జగన్, గంగాధర్, ఖలీల్, నాగమల్లు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top