ప్రభుత్వ తీరుని ఎండగట్టాలి


హైదరాబాద్) చంద్రబాబు
ప్రభుత్వం చేస్తున్న తప్పులు, వైఫల్యాల్ని ఎండగట్టి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. జిల్లాల వారీ
సమీక్షలో భాగంగా కర్నూలు జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. సమీక్షలో జిల్లాకు
చెందిన పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇన్ ఛార్జీలు,
ముఖ్యనేతలు పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి, జిల్లా
వ్యవహారాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర
నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడు రాయలసీమ
ప్రాంతానికి చేస్తున్న అన్యాయం గురించి సమావేశం లో చర్చించారు. సాగునీటి
ప్రయోజనాల్ని అందించే పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, ఓర్వకల్ రిజర్వాయర్, హంద్రీ
నీవా పనులు పూర్తి కాని విషయాన్ని నాయకులు సమావేశం ద్రష్టికి తీసుకొని వచ్చారు.
పట్టి సీమ పేరు చెప్పి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకొన్నారు తప్ప చుక్క నీరు
ఇవ్వలేదని వివరించారు. అమరావతి చుట్టూనే చంద్రబాబు మనస్సు చక్కర్లు కొడుతోందని
నాయకులు పేర్కొన్నారు. జిల్లాల వారీగా అభివ్రద్ది మీద బహిరంగ చర్చకు సిద్దమా అన్న
అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Back to Top