జగన్ విడుదల కోసం మేకపాటి పాదయాత్ర

నెల్లూరు, 26 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదల కావాలంటూ పార్టీ నాయకుడు, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి గురువారంనాడు పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 15 కిలోమీటర్ల మేర నిర్వహించే పాదయాత్రలో ఆయన నెల్లూరు నుంచి నరసింహకొండ వరకు నడిచి వెళతారు. బుధవారంనాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడు తన పాదయాత్ర వివరాలు వెల్లడించారు. కేంద్రంలో అనిశ్నితి నెలకొన్నదని, ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చునని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా టీడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అందుకే ఇప్పుడు జనమంతా జగన్‌ వైపు చూస్తున్నారని అన్నారు. జైలు నుంచి జగన్మోహన్‌రెడ్డి విడుదలైతే రాష్ట్రంలో పండుగ వాతావరణం వస్తుందని ఆయన చెప్పారు. మహానేత అందించిన సువర్ణ పరిపాలన జననేత జగన్‌కే సాధ్యమని రాజమోహనరెడ్డి పేర్కొన్నారు.

Back to Top