జగన్ విడుదల కోరుతూ ప్రత్యేక పూజలు

జమ్మలమడుగు:

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ కన్యతీర్థంలో పార్టీ స్టీరింగ్ కమిటి సభ్యుడు ఎం.హనుమంతరెడ్డి, రైతు నాయకుడు రామలింగారెడ్డి  రెండు రోజుల ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారనీ.. ఆయనకు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందనీ చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేశారన్నారు. ఆయనను జైలు నుంచి విడుదల చేయాలంటూ దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు సంతకాలు చేశారన్నారు. ఇంతవరకు ఏ నాయకుడికీ ఇంత ప్రజాదరణ లేదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. డాక్టర్ వైయస్ఆర్ కుటుంబం పైన ప్రభుత్వం చేపడుతున్న కక్షసాధింపు చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర యువజన స్టీరింగ్ కమిటి సభ్యుడు హనుమంతరెడ్డి, రైతు నాయకుడు రామలింగారెడ్డిలు మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్‌ రెడ్డి బయటికి రావాలని రెండు రోజుల నుంచి హోమం చేశామన్నారు.

Back to Top