వరంగల్ ప్రచారానికి వైఎస్ జగన్


వరంగల్ లోక్ సభ నియోజక
వర్గం ఉప ఎన్నిక ప్రచారం లో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పాల్గొననున్నారు.  ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల `16 నుంచి
అంటే వచ్చే సోమవారం నుంచి ఆయన పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు వైఎస్ జగన్
పర్యటన కొనసాగనుంది. నియోజక వర్గంలోని అన్ని పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ
జగన్ పర్యటిస్తారు. జగన్ రాకతో పార్టీ శ్రేణులు మరింత పుంజుకొంటాయని, అభ్యర్థి
సూర్య ప్రకాశ్ విజయావకాశాలు బాగా మెరుగవుతాయని వైస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర
అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. 

Back to Top