జగన్‌తోనే ప్రజా సంక్షేమం: జక్కంపూడి

ఆలమూరు, 27 ఆగస్టు 2012 : వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ అధ్యక్షుడు వైయస్­ జగన్మోహన్­రెడ్డితోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా  ఆలమూరు మండలం నర్సిపూడిలో కొత్తపేట నియోజకవర్గం వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్­చార్జి చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజయలక్ష్మితో పాటు పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, వాణిజ్య విభాగం జిల్లా చైర్మన్­ రెడ్డి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొల్లి నిర్మలకుమారి మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని, రాష్ట్రంలో వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీయే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదని ఆరోపించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్­ విజయమ్మ ఏలూరులో నిర్వహించిన ఫీజు పోరు విజయవంతమైందన్నారు. వైయస్­ఆర్­ కాంగ్రెస్­ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు నిబద్ధతతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోరారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

Back to Top