ప్రత్యేక హోదా కోసం యువభేరి

తిరుపతి:  ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం యువ భేరి నిర్వహిస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకొని అక్కడ నుంచి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్ లోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకొన్నారు. అక్కడ యువభేరి కి నాంది పలికారు.


‘ప్రత్యేక హోదా, ఉద్యోగావకాశాలు, రాష్ట్రాభివ్రద్ధి’ పై చర్చ
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో భారీగా పరిశ్రమలు తరలివచ్చి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో దీనిపై హామీలు గుప్పించిన చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు. దీంతో యువతకు దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకుండా పోతున్నాయి.
దీనిపై బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైెఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యూఢిల్లీ వెళ్లి అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. మంగళగిరిలో రెండు రోజుల పాటు సమర దీక్ష చేయటంతో పాటు న్యూఢిల్లీ వెళ్లి అక్కడ మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయటంతో పాటు అసెంబ్లీ వేదికగా అనేకసార్లు ఈ విషయంపై పోరాడారు.

తిరుపతిలో యువ కెరటం
యువ భేరికి పెద్ద ఎత్తున యువతీ యువకులు, విద్యార్థులు తరలి వచ్చారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ తో పాటు ఇతర కాలేజీలు, విశ్వ విద్యాలయాల నుంచి స్టూడెంట్స్ తరలి వచ్చారు. వైెఎస్ జగన్ నాయకత్వంలో ఉద్యమించేందుకు కదలి వచ్చారు. 


తాజా వీడియోలు

Back to Top