జామీను పత్రాల‌ను పరిశీలించిన న్యాయమూర్తి

హైదరాబాద్, 24 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌కు సంబంధించి జామీను పత్రాలను సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. వైయస్ అవినాష్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి మంగళవారం పూచీకత్తు పత్రాలను నాంపల్లి సిబిఐ కోర్టుకు సమర్పించారు. వీరు సమర్పించిన పత్రాలను సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు పరిశీలించారు. జామీను ఇచ్చిన అవినాష్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి వ్యక్తిగత వివరాలను కూడా న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలుసుకున్నారు.

అనంతనం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విడుదలకు సంబంధించిన పత్రాలు సిద్ధ‌ం చేయమని సిబ్బందిని న్యాయమూర్తి ఆదేశించారు. విడుదల ఆర్డర్ సిద్ధమైన వెంటనే న్యాయమూర్తి వాటిపై సంతకం చేస్తారు. కోర్టు సిబ్బంది ఆ ఆదేశాలను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేస్తారు. జైలులో కోర్టు ఆదేశాలను పరిశీలించిన తరువాత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బయటకు వస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చని సమాచారం.

Back to Top