నిలకడగా జగన్ ఆరోగ్యం: ఐజీ

హైదరాబాద్ 26 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న  నిర్ణయానికి నిరసనగా చంచల్‌గూడ జైల్లో నిరవధిక దీక్ష చేపట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారనీ,  ప్రస్తుతానికి ఆయన రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు సాధారణంగానే ఉన్నాయనీ తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం  ఆరు గంటలకు హెల్తు బులెటిన్ విడుదల చేస్తామని జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ చెప్పినట్టుగానే నిరాహారదీక్ష రెండోరోజున సాయంత్రం జైలు వర్గాలు ఈ వివరాలు తెలిపాయి. అంతకుముందు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్‌తో వైఎస్ఆర్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావులు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.

తాజా ఫోటోలు

Back to Top