తుపాను సహాయ కార్యక్రమాలలో పాల్గొనండి

హైదరాబాద్ 11 అక్టోబర్ 201

3: పైలిన్ పెను తుపాను రూపంలో ముంచుకొస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సూపర్ సైక్లోన్ గా పరిగణిస్తున్న ఈ తుపాను గంటకు 220 కిమీ పైబడి వేగంగో భూమి మీదకు దూసుకు వస్తోందన్న సమాచారాన్ని బట్టి ప్రాణ, ఆస్థి నష్టానికి పెనుప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలలో, సహాయ, పునరావాస కార్యక్రమాలలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం యంత్రాంగం కూడా ఏమాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ ప్రదర్శించరాదని ఆయన సూచించారు.ఈ మేరకు ఆయనో ప్రకటన విడుదల చేశారు.

Back to Top