జగన్ పుట్టిన రోజు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

హైదరాబాద్, 21 డిసెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 40వ పుట్టిన రోజు వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా జరిగాయి. పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. అనంతరం పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, జనక్ ప్రసాద్, గట్టు రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ల్ర వ్యాప్గంగా రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్శహించారు.

తాజా ఫోటోలు

Back to Top