జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

నల్లమాడ:

రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్  జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని  జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కడపల మోహన్ రెడ్డి, నాయకులు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ నాగేంద్ర కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం యర్రవంకపల్లి రచ్చబండ వద్ద స్థానిక నాయకుడు మట్రా రాజశేఖర్ అధ్యక్షతన ఏర్పాటయిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యర్రవంకపల్లి, మీసాలవాండ్లపల్లెలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు బసగాని శ్రీనివాసులు యాదవ్, రమేష్, బి. వీరనారప్ప, బి. వీరనారాయణ, వెంకటనారాయణ, రమణయ్యల ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను ఓర్వలేక టీడీపీ కాంగ్రెస్‌లు కుట్ర పన్నాయన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో మొదటి ఓటు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి అఖండ మెజారిటీతో గెలిపించడమే మనందరి బాధ్యతన్నారు. నిస్వార్థంతో పని చేసిన వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. మహిళలపై దాడులను అరికట్టలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలను కులవృత్తులకే పరిమితం చేసి చంద్రబాబు వారికి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.

Back to Top