జగన్‌ను కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చిత్తూరు జిల్లా వాయల్పాడు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(తెలుగుదేశం) వెల్లడించారు. గురువారం ఉదయం ఆయన చంచల్‌గుడా జైలుకు వెళ్ళి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం జైలు బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్న వర్గాల ప్రజలు శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చింతల చెప్పారు. శ్రీ జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఆ పార్టీలో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తన నియోజకవర్గంలోని ప్రజలు స్పష్టంచేశారని పేర్కొన్నారు. వారి వత్తిడితోనే తాను శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిశానని చింతల చెప్పారు. వచ్చే ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలు ఉనికి కోల్పోయాయని తెలిపారు. కిందటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యిందని ఆరోపించారు. రామచంద్రారెడ్డి తెలుగుదేశం 1987  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వెంట పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి కూడా ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top