జగన్‌ను బయటకు రానివ్వకుండా కుట్ర

హైదరాబాద్‌, 12 మే 2013: ఎన్నికలు పూర్తి అయ్యే వరకు పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటకు రానివ్వకూడదని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుట్ర పన్నుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త, కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి సిబిఐని వినియోగించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఆదేశాల మేరకే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమం చేపట్టినట్లు కొణతాల చెప్పారు.
Back to Top