జగన్‌ను అక్రమంగా జైల్లో ఉంచారు: జూపూడి

హైదరాబాద్ 22 మార్చి 2013:

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. కాంగ్రెస్ కుట్ర బట్టబయలయ్యిందనీ,  స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ సీబీఐని వాడుకుంటోందనీ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధిష్టానం మాట వినలేదనే ఏకైక కారణంతోనే శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించారని ఆయన ధ్వజమెత్తారు.  మానవహక్కుల్ని మంటగలిపేలా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జరుగుతున్న ప్రయత్నాల్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top