జగన్ ను చూస్తేనే భయపడుతున్నారు..!

అనంతపురంః ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, విశ్వేశ్వర్ రెడ్డిలు అన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 

చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, మంత్రులను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. 
Back to Top