జగన్‌ నిర్బంధానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

హైదరాబాద్, 27 మే 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా వైయస్ అభిమానులు,‌ పార్టీ కార్యకర్తలు సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు నెక్లెస్ రోడ్డు‌లోని పీపుల్సు ప్లాజా వద్ద అత్యధిక సంఖ్యలో కొవ్వుత్తులు వెలిగించి వారంతా నిరసన తెలుపనున్నారు. భారీ ఎత్తున జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పాల్గొంటారు. శ్రీ జగన్‌ను సిబిఐ అక్రమంగా అరెస్టు చేసి సోమవారానికి సంవత్సరం పూర్తయింది.

‌అలాగే, మంగళవారం నాడు ఇందిరా పార్కు వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిరసన దీక్ష చేస్తారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆమె ఈ దీక్ష చేస్తారు. నిరసన దీక్షలో శ్రీ జగన్ సతీమణి‌ శ్రీమతి వైయస్ భారతి కూడా పాల్గొంటారు.

Back to Top